చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని రెడ్డివారిపల్లి గ్రామంలో రైతు టి. కుమార్ పొలంలో అమర్చిన పైపులైన్లు, స్ప్రింకర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మంగళవారం బాధితుడు ఎస్ఐ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు.
గతంలో ఆస్తి వివాదాలున్న వేమారెడ్డి చంద్రారెడ్డిలే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
