చీరాల: అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఐ హెచ్ ఆర్ సి జెనీవా ఇండియన్ నేషనల్ చాప్టర్‌కు జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చీరాలకి చెందిన న్యాయవాది రాజేశ్వరి చేబ్రోలును నియమించారు. ఈ మేరకు ఐ హెచ్ ఆర్ సి జెనీవా భారత జాతీయ అధ్యక్షుడు,అంతర్జాతీయ రాయబారి డాక్టర్ కె. రాజానందన్ విజ్ఞాన్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలి తో సంప్రదింపుల హోదా కలిగి ఐక్యరాజ్యసమితి
మానవ హక్కుల హై కమిషనర్ కార్యాలయం తో అనుబంధంగా పనిచేస్తున్న ఐ హెచ్ ఆర్ సి,జెనీవా మానవ హక్కుల పరిరక్షణ, శాంతి ప్రోత్సాహానికి కట్టుబడి ఉన్న ప్రపంచవ్యాప్త సంస్థగా గుర్తింపు పొందింది.రాజేశ్వరి చేబ్రోలు నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఆమె పదవీకాలం రెండేళ్లుగా ఉంటుందని పనితీరు సంతృప్తికరంగా ఉంటే పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని తెలిపారు. జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆమె జాతీయ, ప్రాంతీయ
సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, ఈవెంట్ల నిర్వహణ, లాజిస్టిక్స్ సమన్వయం, రాష్ట్ర కమిటీలు,అంతర్జాతీయ భాగస్వాములతో అనుసంధానం వంటి కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.
అలాగే ఈవెంట్ల డాక్యుమెంటేషన్, నివేదికల తయారీతో పాటు జాతీయ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి అప్పగించే ఇతర విధులను కూడా నిర్వర్తించనున్నారు.ఈ సందర్భంగా ఐ హెచ్ ఆర్ సి జెనీవా ఆమె నియామకానికి అభినందనలు తెలియజేసింది.మానవ హక్కుల పరిరక్షణ దిశగా ఆమె సేవలు సంస్థకు మరింత బలాన్ని చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
#Narendra




