Tuesday, February 3, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshవైయస్ జగన్మోహన్ రెడ్డికి వైలెన్స్ కావాలి సీఎం చంద్రబాబుకి సైలెన్స్ కావాలి

వైయస్ జగన్మోహన్ రెడ్డికి వైలెన్స్ కావాలి సీఎం చంద్రబాబుకి సైలెన్స్ కావాలి

రాష్ట్రంలో శాంతి, సంక్షేమం-అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన – వైసిపి అరాచక రాజకీయాలు
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కి వైలెన్స్ కావాలి, సీఎం చంద్రబాబు కి సైలెన్స్ కావాలి
రాష్ట్ర దూదేకుల ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ కె.నాగుల్ మీరా వెల్ల‌డి
ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం
వైసీపీ నాయకులు మనస్తత్వం అరాచకం, గొడవలు
ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ టిడిపి

వైసిపి నాయ‌కులు నోరు అదుపులో పెట్టుకోవాలి
అభిమానులు వైసిపి నాయ‌కుల‌కే కాదు… సీఎం చంద్ర‌బాబు కి మంత్రి లోకేష్ కి అభిమానులు ఉంటారు
విజ‌య‌వాడ : రాష్ట్రంలో ఇటీవ‌ల చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌కు… వైసిపి నాయకుల బాధ్యతారాహిత్యమైన మాటలు, ప్ర‌వ‌ర్త‌నే కార‌ణమంటూ రాష్ట్ర దూదేకుల పైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ కె.నాగుల్ మీరా మండిప‌డుతూ..

ఇలాంటి దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కూడ‌ద‌ని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంద‌న్నారు. ఎమ్మెల్యే వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి త‌న రాజ‌కీయ స్వ‌లాభం కోసం వైలెన్స్ కోరుకుంటుంటే, సీఎం చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతూ అభివృద్ధిపై దృష్టి సారించారని తెలిపారు.

సీఎం చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల‌పై వైసిపి నాయ‌కులు అంబ‌టి రాంబాబు, జోగి ర‌మేష్ చేసిన అనుచిత వ్యాఖ్య‌లు ఖండిస్తూ…రాష్ట్ర దూదేకుల పైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ కె.నాగుల్ మీరా సోమ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు కోగంటి రామారావుతో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబు పై తాను అలా మాట్లాడి వుండ‌కూడ‌ద‌ని వైసిపి నేత అంబ‌టి రాంబాబు చెబితే… పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అండ‌గా వుంటాన‌ని, శాంతి భ‌ద్ర‌త‌లు కాపాడ‌టంలో పోలీసులు విఫ‌ల‌మైయ్యార‌ని మాట్లాడ‌టం హాస్యాస్పదంగా వుంద‌న్నారు. పోలీసులు లేక‌పోతే అంబ‌టి రాంబాబు ప‌రిస్థితి చాలా దారుణంగా వుండేద‌ని వీడియో క్లిపింగ్స్ చూస్తే అర్ధ‌మ‌వుతుందన్నారు.

ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌టం దుర‌దృష్ట‌క‌రం…..ఇటువంటి జ‌ర‌గ‌కూడ‌ద‌నే టిడిపి కోరుకుంటుంద‌న్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేర‌కు రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలోలో టెలికాన్ప‌రెన్స్ జ‌రిగింద‌ని ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృత్తం కాకుడ‌ద‌ని చెప్ప‌టం జ‌రిగిందన్నారు…

సంపదను సృష్టించి, ఆ సంపద ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి అందించాలన్నదే సీఎం నారాచంద్రబాబు నాయుడు నాయ‌క‌త్వంలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం ఆ దిశగా పాల‌న సాగిస్తోంద‌న్నారు. వైసిపి నాయ‌కులు ప‌లు కేసుల్లో జైలుకు వెళ్లి విడుద‌లైన త‌ర్వాత ఊరేగింపులు చేసుకోవ‌టం ఇదేమి సంప్ర‌దాయ‌మో అర్ధం కావ‌టం లేద‌న్నారు.

గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌లో వై.ఎస్.జ‌గ‌న్ ను ఒక మాట అన్నాడ‌ని కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ ఇంటి పై, పార్టీ ఆపీస్ పై అల్ల‌రి మూక‌ల‌ను పంపించి దాడి చేయించి, .ఉద్యోగ‌స్తుల‌ను కూడా రాడ్లు పెట్టి కొట్టించారు క‌దా….మ‌రి ఆనాడు త‌ప్పు అనిపించ లేదా అంటూ ప్ర‌శ్నించారు. ఆనాడు త‌న గురించి మాట్లాడితే అభిమానులు స్పందిస్తార‌ని వై.ఎస్.జ‌గ‌న్ అన్నాడు…అభిమానులు సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ ల‌కు వుండ‌రా అంటూ ప్ర‌శ్నించారు. వాళ్లు స్పందించ‌ర‌ని వై.ఎస్.జ‌గ‌న్ తో పాటు వైసిపి నాయ‌కులు ఎలా అనుకుంటార‌ని ప్రశ్నించారు. వై.ఎస్.జ‌గ‌న్ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ కి అల‌వాటు ప‌డ్డాడ‌ని తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించి పెట్టుబ‌డులు రాకుండా…యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు లేకుండా చేయాల‌నే ల‌క్ష్యంతో వై.ఎస్.జ‌గ‌న్ ప‌నిచేస్తున్నారని మండిప‌డ్డారు. .ఆనాడు జైలు కెళ్లి విడుద‌లైన స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఊరేగింపు చేశాడు కాబ‌ట్టి…జైలు వెళ్లి విడుద‌లైన వైసిపి నాయ‌కులకు ఊరేగింపు చేయ‌టం ఒక అల‌వాటుగా మారింద‌న్నారు.

త‌న ఇంటికి మీద‌కి వ‌చ్చిన‌ప్పుడు అమ్మ‌,నాన్న‌, భార్య పిల్ల‌లు వున్నార‌ని జోగి ర‌మేష్ అంటున్నాడు..మ‌రి ఆనాడు కొమ్మారెడ్డి ప‌ట్టాబి రామ్ ఇంటి పైకి దాడికి వెళ్లిన‌ప్పుడు ఆ ఇంట్లో భార్య పిల్ల‌లు లేరా అంటూ ప్ర‌శ్నించారు. వైసిపి గుండాలు దాడి చేసే స‌మ‌యానికి ముందే ప‌ట్టాభి భార్య మార్కెట్ కి వెళ్ల‌టం జ‌రిగింద‌ని, ఆ పట్టాబి కూతుర్ని ప‌నిమ‌నిషి బాత్ రూమ్ లో గంట సేపు దాచి పెట్టిందన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వై.ఎస్.జ‌గ‌న్ ఆ నాడు ఇది స‌రైన విధానం కాద‌ని ఎందుకు మాట్లాడ‌లేదో స‌మాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

తెలుగు దేశం పార్టీకి కోటి మంది కార్య‌క‌ర్త‌లు వున్నార‌ని అందులో కొంత‌మందికి ఆవేశం క‌లిగి ఇలాంటి ఘ‌ట‌న‌లు జరిగి వుండొచ్చు…ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కూడ‌ద‌నే తెలుగుదేశం పార్టీ నాయ‌కుల ఆలోచ‌న అన్నారు. జోగి ర‌మేష్ త‌న‌ ఇంటి ద‌గ్గ‌రికి వ‌స్తే ఇంత బాధ‌ప‌డుతున్నావు క‌దా…ప‌ద్నాలుగు ఏళ్లు సీఎంగా చేసిన సీఎం చంద్ర‌బాబు ఇంటి పైకి వెళ్లిన‌ప్పుడు ఈ ఆలోచ‌న రాలేదా అంటూ ప్ర‌శ్నించారు. కల్తీ మ‌ద్యం కేసులో జైలుకి వెళ్లిన జోగి ర‌మేష్ ఏదో మ‌హానేత లా ఊరేగింపుగా వెళ్లి సీఎం చంద్ర‌బాబు , డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ ల‌ను ప‌ట్టుకుని నీ నోటికి వ‌చ్చిన‌ట్లు మ‌ట్లాడ‌తావా? అంటూ దుయ్య‌బ‌ట్టారు.

వైసిపి నాయ‌కుల ఆరాచ‌కాల‌ను తాము క్ష‌మించినా…స‌భ్య స‌మాజం క్ష‌మించ‌ద‌న్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని త‌మ పార్టీ నాయ‌కులు ఖండిస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌లో ఏ ఒక్క వైసిపి నాయ‌కుడు కూడా ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు ఏ ఒక్క‌రు ఖండించ‌లేద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వంలో రెచ్చిపోయిన.

నాయ‌కుల‌ను ఎందుకు వదిలేశార‌ని ప్ర‌జ‌లు అడుగుతున్నార‌న్నారు. రెడ్ బుక్ లో చ‌ట్ట రీత్యా త‌ప్పు చేసిన వారికే స్థానం వుంటుంద‌న్నారు. రాజ్యాంగ బ‌ద్దంగా ప‌నిచేసిన వారిపై ఏ ర‌క‌మైన చ‌ర్య‌లు వుండ‌వని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌లు ఇచ్చిన అవ‌కాశాన్ని ప్ర‌జ‌ల కోసం, ప్ర‌జ‌ల హితం కోసం..ప్ర‌జ‌ల సంక్షేమం కోసం… రాష్ట్ర అభివృద్ది కోసం ప‌నిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ వైసిపి నాయ‌కులు ఇక‌నైనా…నోరు అదుపులో పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు.

వైసిపి నాయ‌కుల పాల‌న, భాష‌, దురాగ‌తాలు, ఆరాచ‌కాల‌కు ప్ర‌జ‌లు విసుగు చెంది ఇటువంటి ఆరాచ‌క పాల‌న, నిర్భంద పాల‌న వ‌ద్ద‌నుకొని ప్ర‌జ‌లు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ ర‌చించిన రాజ్యాంగం అమ‌లు చేసే నాయ‌కుడు కావాల‌ని…కులాలు, మ‌తాల‌కు అతీతంగా ఎన్డీయే కూట‌మికి 164 సీట్లు ఇచ్చి నారా చంద్ర‌బాబు నాయుడు సీఎంగా

గెలిపించుకున్నార‌న్నారు. ప్ర‌జ‌లు జ‌గ‌న్ కి ఓట్లు వేయ‌క‌పోవ‌టానికి అసంతృప్తి కార‌ణం కాదని…ప్ర‌జ‌లు జ‌గ‌న్ ను వ‌ద్ద‌నుకోని ఎన్డీయే కూట‌మికి ఓట్లు వేశార‌ని తెలిపారు. అసంతృప్తి వేరు వ‌ద్ద‌నుకోవ‌టం వేరు..ఈ తేడాని జ‌గ‌న్ గ‌మ‌నించాలన్నారు… రాష్ట్ర ప్ర‌జ‌ల్లో ఏ ఒక్క‌రు కూడా వై.ఎస్ జ‌గ‌న్ కావాల‌ని కోరుకోవ‌టం లేద‌న్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments