Tuesday, February 3, 2026
spot_img
HomeSouth ZoneAndhra PradeshVidadala Rajani: విడదల రజనిపై కేసు నమోదు.

Vidadala Rajani: విడదల రజనిపై కేసు నమోదు.

గత నెల 30న యడ్లపాడు దేవస్థానం వద్ద ఉద్రిక్తత
రజనితో పాటు 21 మంది వైసీపీ నేతలపై దాడి

శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని కేసు
ఏపీలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదయింది. యడ్లపాడు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై కూడా కేసు నమోదయింది.

కేసు వివరాల్లోకి వెళితే… గత నెల 30న యడ్లపాడులోని దేవస్థానానికి తన అనుచరులతో పాటు విడదల రజని వెళ్లారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని చెపుతూ… ఆలయాన్ని శుద్ధి చేయడానికి ఆమె యత్నించారు. అయితే, ఆలయంలోకి వెళ్లకుండా టీడీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లోపలకు వెళతామని వైసీపీ నేతలు పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వైసీపీ నేతలకు సర్దిచెప్పి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ విడదల రజని, ఆమె అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తాజాగా అంబటి రాంబాబు, జోగి రమేశ్ లపై కూడా పోలీసు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటిపై… నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జోగి రమేశ్ పై కేసులు నమోదయ్యాయి. అంబటికి మేజిస్ట్రేట్ రిమాండ్ కూడా విధించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments