Home South Zone Andhra Pradesh ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన వైసీపీ నేత చరిత్ రెడ్డి

ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన వైసీపీ నేత చరిత్ రెడ్డి

0

రామసముద్రం మండలం వైసీపీ మండల కన్వీనర్ కేశవరెడ్డి తనయుడు, యువ నాయకుడు చరిత్ రెడ్డి ఢిల్లీలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వాములుగా చేయడంపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది.

NO COMMENTS

Exit mobile version