కేవలం రూ. 3500కే గోవా టూర్.. TGSRTC బంపర్ ఆఫర్!
ఫిబ్రవరి రెండవ వారంలో సెలవులను పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) సాధారణ ప్రయాణికుల కోసం కొత్త పర్యాటక ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కేవలం రూ. 3,500తో గోవా, హంపి, తుల్జాపూర్‌లను సందర్శించే నాలుగు పగళ్లు, మూడు రాత్రుల పర్యటన అందుబాటులో ఉంది. అలాగే రూ. 3,000తో మహారాష్ట్ర, కర్ణాటకలోని నాలుగు ప్రధాన దేవాలయాలను (పంధర్‌పూర్, గంగాపూర్, కొల్హాపూర్, తుల్జాపూర్) సందర్శించే తీర్థయాత్ర ప్యాకేజీని కూడా టీజీఎస్సార్టీసీ అందిస్తోంది. ఈ ప్యాకేజీలు హైదరాబాద్ నుండి ప్రారంభమవుతాయి.




