Home South Zone Andhra Pradesh వైద్యుడికి ల్యాబ్ నివేదికే దిక్సూచి: DMHO విజయమ్మ

వైద్యుడికి ల్యాబ్ నివేదికే దిక్సూచి: DMHO విజయమ్మ

0

 

బాపట్ల జిల్లా: ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు వ్యాధి నిర్ధారణ చేయడంలో ల్యాబ్ టెక్నీషియన్లది అత్యంత కీలకమైన పాత్ర అని బాపట్ల జిల్లా డిఎంహెచ్వో శ్రీమతి డాక్టర్ విజయమ్మ అన్నారు. ఈరోజు స్థానిక బాపట్ల ఎన్జీవో హోమ్ లో జరిగిన బాపట్ల జిల్లా ల్యాబ్ టెక్నీషియన్లు మరియు సబ్ యూనిట్ అధికారుల నెలవారి మలేరియా సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విజయమ్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్లు కచ్చితంగా సమయపాలన పాటిస్తూ రోగులకు ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా వ్యాధి నిర్ధారణ చేసినప్పుడే రోగులకు సరైన న్యాయం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ల్యాబ్ లలో ఏమైనా పరికరాలు అవసరం ఉంటే గౌరవ కలెక్టర్ ప్రారంభించిన బాపట్ల సేతు యాప్లో వైద్యాధికారి ద్వారా కావలసిన వస్తువులను ఇండెంట్ పెట్టాలని ఆదేశించారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version