Thursday, February 5, 2026
spot_img
HomeSouth ZoneTelanganaగుంజేడు ముసలమ్మ ఆలయ ఈవోగా అనిల్ బాధ్యతల స్వీకరణ

గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవోగా అనిల్ బాధ్యతల స్వీకరణ

మహబూబాబాద్/ కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: మండలంలోని కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన శ్రీ గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో శేషగిరి నేడు ఉద్యోగ విరమణ చేశారు. గత కొంతకాలంగా ఆలయ అభివృద్ధి మరియు నిర్వహణ బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహించి, నేడు పదవీ విరమణ సందర్భంగా ఆలయ సిబ్బంది మరియు అర్చకులు ఆయన సేవలను కొనియాడారు.

​ఆయన స్థానంలో నూతన కార్యనిర్వహనాధికారిగా వరంగల్‌కు చెందిన *యం. అనిల్* నియమితులయ్యారు. ఈ రోజు ఆయన అధికారికంగా ఆలయ ఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నూతన ఈవో అనిల్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments