చిన్నగంజం మండలంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నలుగురు యువకులు పల్లెపాలెం సముద్ర తీరానికి ఈతకు వెళ్లగా, ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు అలల్లో గల్లంతయ్యారు.
మరో ఇద్దరు సురక్షితంగా బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న చిన్నగంజం MRO ప్రభాకర్ రావు, SI రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రంలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
#Narendra
