Thursday, February 5, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshటిఆర్ఎస్ పదవికి వన్నె తేవాలి

టిఆర్ఎస్ పదవికి వన్నె తేవాలి

జేఎస్ఆర్ పదవికి వన్నె తేవాలి…

మంగళగిరి ఆర్ఆర్ టవర్స్ లోని ఉన్నతి వాకర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ 203 కార్యాలయంలో గురువారం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పద్మశాలియ సంఘం జిల్లా అధ్యక్షునిగా నియమితులైన ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు(జేఎస్ఆర్) ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జేఎస్ఆర్ ను అసోసియేషన్ నాయకులు శాలువాలతో సత్కరించి బొకేలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. జేఎస్ఆర్ పద్మశాలి సంఘం అధ్యక్షునిగా చేనేత పరిశ్రమ, చేనేత కార్మికుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసి పదవికి వన్నె తెచ్చే విధంగా పేరు తెచ్చుకోవాలన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు మేకల మోహనరావు.

ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు నేరేళ్ల లక్ష్మణరావు, ఆలేటి పూర్ణ, ఉన్నతి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జీ మురహరిరావు, నాగేశ్వరరావు, కోశాధికారి రాజు, పెదవడ్లపూడి వెంకటేశ్వర వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నిర్మల, మంగళగిరి భావనాఋషి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు శోభారాణి, నవులూరు అన్నపూర్ణ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నాగమణి, స్థానిక ఆర్ఆర్ టవర్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments