Friday, February 6, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshవేటపాలెం వద్ద టాటా ఏసీలో అగ్నిప్రమాదం |

వేటపాలెం వద్ద టాటా ఏసీలో అగ్నిప్రమాదం |

చీరాల: చీరాల–ఒంగోలు జాతీయ  రహదారి 216పై వేటపాలెం మండలం సమీపంలో బుధవారం ప్రయాణిస్తున్న ఒక టాటా ఏసీ ఆటోలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఆటో కింద నుంచి అకస్మాత్తుగా పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని వెంటనే రోడ్డుపక్కకు నిలిపి ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులను సురక్షితంగా బయటకు దించివేశాడు.

అనంతరం మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అవి తీవ్రరూపం దాల్చడంతో అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదుతిమ్మసముద్రం నుంచి చీరాలకు బాడుగ నిమిత్తం వెళ్తున్న ఈ టాటా ఏసీ ఆటోలో డ్రైవర్‌తో పాటు బెజ్జం జడ్సన్, కాటేమ్ అన్నానియ్యా, మిరియాల సన్నీ అనే యువకులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అయితే అగ్ని ప్రమాదంలో ఆటో పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

#Narendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments