Home South Zone Andhra Pradesh జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు

జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు

0

బాపట్ల: జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే అక్రిడిటేషన్ కార్డ్స్ సంబంధించి జనవరి 30 వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన బాపట్ల జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో ప్రభుత్వ జీవోను 100% పూర్తి స్థాయిలో అమలు చేయడం వలన అనేక మంది చిన్న పత్రికలకు సంబంధించిన జర్నలిస్టులు అక్రిడిటేషన్ లు పొంద లేకపోయారనీ వారు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

అనేక సంవత్సరాలుగా పత్రికా రంగంలో  కొనసాగుతూ గౌరవప్రదంగా ప్రభుత్వం అందించే అక్రిడిటేషన్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పరిస్థితులలో ఈ విధంగా తీవ్ర అన్యాయం జరగటం వల్ల అనేకమంది నష్టపోవడం జరిగిందనీ కలెక్టర్ కు తెలిపారు.

ఈ నేపథ్యంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ గా మీకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి    జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో చర్చించి రెండవ జాబితాలో జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్   మంజూరు అయ్యేవిధంగా చొరవ చూపాలనికలెక్టర్ ను కోరారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version