Home South Zone Andhra Pradesh పాలుట్ల గిరిజన గూడెంలో చారిత్రాత్మక కార్యక్రమం |

పాలుట్ల గిరిజన గూడెంలో చారిత్రాత్మక కార్యక్రమం |

0

ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు యర్రగొండపాలెం మండలం పాలుట్ల గిరిజన గూడెంలో చారిత్రాత్మక కార్యక్రమం నిర్వహించబడుతోంది.
యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి అధ్యక్షతన, మొట్టమొదటి సారిగా రూ. 3 కోట్ల వ్యయంతో 611 గిరిజన కుటుంబాల అవసరాల కోసం “అప్ గ్రిడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్ (PVTG)”
రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు
వీధి సోలార్ లైట్లు ప్రారంభించబడనున్నాయి.

ప్రారంభికులు:
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు
అతిరధమహారధులు:
ప్రకాశం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు & కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు
గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు
మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు
బ్రిటిష్ కాలం నాటి నుండి కరెంటు నోచుకోని గిరిజనులకు స్వచ్ఛమైన విద్యుత్ వెలుగులు అందించే మహత్తర కార్యక్రమం!

ఇది కేవలం అభివృద్ధి కాదు — గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపే చారిత్రాత్మక అడుగు.
యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మధ్యానం 2 గంటలకు పాలుట్ల గ్రామానికి బయలదేరునున్నారు
కావున నియోజకవర్గంలోని టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గిరిజన సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.
ఇట్లు
తెలుగుదేశం పార్టీ కార్యాలయం
యర్రగొండపాలెం నియోజకవర్గం

NO COMMENTS

Exit mobile version