Saturday, February 7, 2026
spot_img
HomeSouth ZoneTelanganaప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల వైకల్యం గుర్తింపు శరవేగంగా పూర్తి చేయాలి

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల వైకల్యం గుర్తింపు శరవేగంగా పూర్తి చేయాలి

నేలకొండపల్లి: విద్యార్థులలో ఉన్న వైకల్యాల గుర్తింపు ప్రక్రియ ను శర వేగంగా పూర్తి చేయాలని నేలకొండపల్లి మండల విద్యాశాఖాధికారి బాలిన చలపతిరావు సూచించారు. మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం స్పెషల్ ఎడ్యుకేటర్స్ తో ప్రత్యేక సమావేశం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రతీ పాఠశాల లో విద్యార్థులను తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వారిలో ఉన్న లోపంను గుర్తించి ఆన్ లైన్ చేయాలని సూచించారు. విద్యార్థి లోపం ను గుర్తించిన తరువాత ప్రభుత్వం వారికి అవసరమైన యంత్రాలు, పరికరాలు, నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు.

జాతీయ విద్యా పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే సర్వే ను ఉపాధ్యాయులు బాధ్యత గా తీసుకోవాలని సూచించారు. తొలుత ఆయా పాఠశాలఉపాధ్యాయులు విద్యార్థుల లోపాలను గుర్తించాలని.. ఆ తరువాత స్పెషల్ ఎడ్యుకేటర్స్ రెండో విడత లో సర్వే చేసి నిర్ధారిస్తారని పేర్కోన్నారు.

మండలంలోని రాజేశ్వరపురం, చెరువుమాధారం, నేలకొండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నేలకొండపల్లి బాలికల ఉన్నత పాఠశాల లను నాలుగు క్లస్టర్స్ గా విభజించినట్లు తెలిపారు.

మండలం లోని ప్రాధమిక పాఠశాలలు 40, ప్రాధమికొన్నత పాఠశాలలు 5, ఉన్నత పాఠశాలలు 13 లో సర్వే ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. సర్వే గుర్తింపు లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments