అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పోతబోలు గ్రామానికి చెందిన నిశాంత్ కుమార్ అనే బాలుడు లివర్ ఫెయిల్యూర్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్న ఈ బాలుడి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
తమ బిడ్డను కాపాడుకునేందుకు దాతలు ముందుకు రావాలని కుటుంబ సభ్యులు బుధవారం మదనపల్లిలో కన్నీటితో వేడుకున్నారు. భారీ వైద్య ఖర్చుల కోసం ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహాయం కోరారు.




