అన్నమయ్య జిల్లా సర్వేలెన్స్ అధికారిగా, మదనపల్లి పీపీ యూనిట్ ఇన్‌చార్జిగా డాక్టర్ శ్రీధర్‌ను నియమిస్తూ డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నియామకం ద్వారా జిల్లాలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, అతిసార వంటి వ్యాధుల కేసులకు సంబంధించిన డేటాను సర్వేలెన్స్ బృందం సేకరించి, ప్రభుత్వానికి నివేదికలు పంపనుంది. ఈ సమాచారం వ్యాధుల నియంత్రణకు, ప్రజారోగ్య పరిరక్షణకు దోహదపడుతుంది.
