అన్నమయ్య జిల్లాలో శుక్రవారం వేకువజామున మదనపల్లి – నిమ్మనపల్లి మార్గంలోని బసినికొండ నాలుగు రోడ్ల కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ, బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో బొలెరో డ్రైవర్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
స్థానికులు వెంటనే బాధితుడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి రెఫర్ చేశారు.




