విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
ఘనంగా ఎల్బీఆర్సిఈ వార్షికోత్సవ వేడుకలు.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.
మైలవరం పట్టణంలోని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల (ఎల్బీఆర్సిఈ) వార్షికోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్, కో ఫౌండర్ లకిరెడ్డి జయప్రకాష్ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ కళాశాల వ్యవస్థాపకులు దివంగత లకిరెడ్డి బాలిరెడ్డి గారు అమెరికా వెళ్లి శ్రమించి అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన బాలిరెడ్డి గారు మాతృభూమిని మరువకుండా ఆయన స్వగ్రామమైన వెల్వడంకు చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు.
మైలవరం ప్రాంతంపై మమకారంతో ఇక్కడ లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పి స్థానికంగా ఉన్నత విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు.
ఎల్బీఆర్సిఈలో చదువుకునే ప్రతి విద్యార్థి వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రయోజకులుగా ఎదగాలన్నారు. భారతీయ విద్యార్థులు ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతి ఒక్కరూ ప్రపంచంలో అత్యుత్తమ మానవ వనరులుగా మారిన భారతీయుల్లో మన ఎల్బీఆర్సీఈ విద్యార్థిని, విద్యార్థులు కూడా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.
