Sunday, February 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshటీటీడీ లడ్డు కల్తీ వాస్తవం జనసేన అధ్యక్షులు వాసు |

టీటీడీ లడ్డు కల్తీ వాస్తవం జనసేన అధ్యక్షులు వాసు |

టీటీడీ లడ్డులు కల్తీ చేసింది వాస్తవం: జనసేన పార్టీ రాష్ట్ర
కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీపై సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, నిర్వహించిన విలేకరుల సమావేశంపై వైసీపీ నేతలు నోటి కిష్టానుసారంగా మాట్లాడటంపై సభ్య సమాజంలోని ప్రజలు తలవంచుకుంటున్నారనీ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్ అన్నారు. శుక్రవారం విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ ఎంపీ వై వి సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన నోటి నుండి శ్రీవారే నిజాలు ప్రజలకు తెలిసేలాగా చేశారని స్పష్టం చేశారు. గతంలో వైసీపీ నేతలు కడపలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ నీ చంపి గుండెపోటు అని చెప్పారు. తర్వాత హత్య అని తెలిసిన తరువాత ప్రభుత్వంపై వేశారని గుర్తు చేశారు.

ఈ సంఘటనలు దృష్టిలో ఉంచుకొని, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ అయ్యిందని చెప్పిన వైవి సుబ్బారెడ్డికి కూటమి ప్రభుత్వం స్పందించి ఆయనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీ కల్తీ లడ్డూల్లో 58 లక్షల 70 వేల కేజీలు నెయ్యి సరఫరాలో సుమారు 58 లక్షల పామాయిల్ వాడారని, ఇందులో 1.70 వేల కేజీలు యాంటీ ఆక్సైడ్స్, ఈస్టర్స్, మోనో గ్లిజరిట్ రసాయనాలను ఉపయోగించి లడ్డూలు తయారు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయ్యిన NDBB తన నివేదికలో వెల్లడించదని తెలిపారు.

గత ప్రభుత్వం వైసీపీ హయాంలో దోచుకోవడానికి మద్యం, ఇసుక, రేషన్ బియ్యం చివరికి శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంత ధైర్యం ఎక్కడినుండి వచ్చిందో అర్థం కావడం లేదు అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు వారికి పుట్టగతులు ఉండవన్నారు. సకల శాఖ మంత్రి పంపించే స్క్రిప్ట్స్ వైసీపీ నేతలు చదివే పరిస్థితి నెలకొందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల లైటింగ్ విషయంలో కూడా గత ప్రభుత్వం సిలువ ఆకారం వచ్చే విధంగా వేసినప్పుడు అక్కడ ఉన్న శ్రీవారి భక్తులు ప్రతిఘటించడంతో టీటీడీ అధికారులు స్పందించి సిలువ లైటింగ్ తీసివేశారని గుర్తు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments