అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం మాట్లాడుతూ, బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్ల రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని రెండు కోళ్ల ఫారాలలో వ్యాధిని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. కోళ్లను ఖననం చేయడానికి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని, పలు శాఖల సమన్వయంతో ఇతర ప్రాంతాలకు కోళ్ల సరఫరాను అడ్డుకునే చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలియజేశారు.
బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు
# కొత్తూరు మురళి.




