Home South Zone Andhra Pradesh మదనపల్లిలో పెట్టెలో పసికందును కాలువలో పడేసిన ఘటన

మదనపల్లిలో పెట్టెలో పసికందును కాలువలో పడేసిన ఘటన

0

అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లె మండలం కోళ్లబైలు సమీపంలో హంద్రీనీవా కాలువలో అప్పుడే పుట్టిన శిశువును అట్టపెట్టెలో పెట్టి గుర్తుతెలియని వ్యక్తులు పడేశారు. సోమవారం నీటిలో కొట్టుకొచ్చిన పెట్టెను స్థానికులు బయటకు తీసి చూడగా అందులో మృతశిశువు ఉండటంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ అమానుష ఘటనకు పాల్పడ్డ వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version