Wednesday, February 11, 2026
spot_img
HomeSouth ZoneTelanganaశ్రీశైలంలో శివనామస్మరణతో మొదలైన బ్రహ్మోత్సవాల సందడి

శ్రీశైలంలో శివనామస్మరణతో మొదలైన బ్రహ్మోత్సవాల సందడి

అయితే గుండం జాతరకు పోదామా…!
బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇక్కడ ఉండటం విశేషం
భక్తుల కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారం
ఈనెల 14 నుంచే జాతర ప్రారంభం
శివరాత్రికి ముస్తబౌతున్న మహా శైవక్షేత్రం

భక్తుల కోసం భారీ ఏర్పాట్లు
మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 10(భారత్ అవాజ్): పచ్చని ప్రకృతి అందాలు నడుమ…. పచ్చని పంట పొలా లు…. చుట్టూ ప్రవహిస్తున్న సెలఏరులు….. ఆహా…. అనిపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం జాతర ఉత్సవాలకు ముస్తాబైంది. చూపరులకు ఈ ప్రాంతం శివుని కన్ను వలే కనబడుతుంది.

రామక్కకు కోటి దండాలు.. పరమేశ్వరునికి ముక్కోటి దండాలు… కరుణించి కాపాడే అపాదమొక్కులవాడికి (వెంకటేశ్వర స్వామికి)శతకోటి దండాలు అంటూ భక్తులు ఆదేవుణ్ణి ఇష్టంగా కొలుచుకుంటారు. జాతరకు జిల్లా నలుమూలల నుండే కాకుండా… వరంగల్, ములుగు, ఖమ్మం జిల్లాల నుండి కూడా లక్షలాదిగా భక్తులు ఈ రామక్క తీర్థాన్ని దర్శించుకునేందుకు తరలిరానున్నారు.

ఈనెల 14 నుంచి ప్రారంభమై ఈనెల 17 వరకు సాగే జాతర అంగరంగవైభావంగా దేవాస్థాన కమిటి ఆధ్వర్యంలో మహోత్సవాలు నిర్వంచబడును. పాఖాల గుండం సరస్సుల మధ్య ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందలతో ఎంతోరమణీయంగా ఉంటూ, భక్తుల కోరినా కోరికలు తీరుస్తున్న ఈ శివాలయం ఎంతో ప్రసిద్ధిగాంచినది.

ఆలయ చరిత్ర విశేషాలు:
కొత్తగూడ మండలం గుండం తిమ్మాపూర్ ప్రాంతంలో కాకతీయు లకాలం నాటి క్రీ.శ.12వ శతాబ్దంలో అప్పటి రాజు గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించి ప్రతిష్టచేయబడిన శైవక్షేతం గుండం చెరువు ఓడ్డున భక్తుల కొరిక్కేలు తీర్చుటకు వేలసిన శ్రీ రామలింగేశ్వర, శ్రీ రాజారాజేశ్వర స్వామి దేవస్థానం కాకతీయులు ఈ ఆలయాన్ని త్రికుటేశ్వర ఆలయంగా పిలిచెడివారు.

ఇచ్చట వెంకటేశ్వర స్వామి, శ్రీ కాలభైరవ, శ్రీ వీరభద్రస్వామి, శ్రీఆంజనేయస్వామి, శ్రీ నాగదేవత రామక్క విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం శాసన ఆధారాల ప్రకారం ఒక మహిమాన్వితమైన అద్భుతాన్ని కాకతీయులు నిర్మించినారు.

గర్భాలయంలో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగంపై పడిన పాలు, నీరు శివలింగం క్రింది భాగమున ఆత్మలింగంపై అభిషేకం జరిగి సోరంగం మార్గం ద్వారా పాలు, నీరు గుండం చెరువులో కలుస్తుంది. ఈ చెరువులో స్నానం చేయడం వలన శుభాలు పొందుతారని భక్తుల నమ్మకం. పూర్వకాలం ఈ శివాలయం చుట్టు ప్రక్కన ఉన్న ఆదివాసి గిరిజనులు ఆలయాన్ని ఆరాధిస్తూ ఉండేవారు.

ఒక గిరిజన దంపతులు సంతానం లేక విచారించుండగా ఒక మహాశివరాత్రి పర్వదినాన గుండం చెరువులో స్నానం చేసి శివలింగానికి అభిషేకం పూజలు చేయడం వలన వారికి సంతానం లభించింది. కార్తీక పౌర్ణమి రోజున ఆ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

ఈ ఆడబిడ్డకు ‘రామక్క’ అని నామకరణం చేసినారు. రామక్క తన చినతన్నం నుంచి ఈ శివాలయంలో ఆరాధాన చేయడం వలన రామక్క భక్తికి మెచ్చిశివుడు వరం ప్రసాదించినాడని ప్రచారంలో ఉంది. అప్పడి నుండి ఈ శైవక్షేత్రాన్ని రామక్క తీర్థంగా, రామక్క జాతరగా పరిడవిలుతూ… భక్తులచే పరిడవిల్లుతుంది. మహశివరాత్రి వచ్చిందంటేనే శివనామస్మరణతో ఈ ప్రాంతం మారుమ్రోగుతుంది.

పురాతన కాలంలోని యంత్ర, మంత్ర బలమో కానీ కోరినా కోరికలు తీర్చే ఇక్కడి శివయ్యను దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రావడం జరుగుతుంది. నూతన వధువు వరులను శివుని ఆశీర్వాదం కోసం ఈ ఆలయానికి తీసుకువస్తారు.
ఈ ఆలయాన్ని సందర్శిస్తే సప్తజన్మములోని పుణ్యఫలాన్ని పొందుతారు_
ఈజాతరకు వచ్చే భక్తులు ముందుగా ఆలయం ముందున్న చెరువులో స్నానం ఆచరించి ఆలయ పరిసరాల్లో దేవునికి నైవేద్యం వండి రంగురంగులు పూలతో అలంకరించిన డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, యువతీ యువకుల నృత్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుళ్ళకు నైవేద్యం సమర్పిస్తారు. ప్రతి రోజు ఆలయంలో దూప, దీప, నైవేద్యం, అభిషేకం, అర్చనలు, హొమాలు, భజనలు, విశేష పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజున మహాలింగార్చన, రుద్రహోమం చేయబడుతాయని, ఈ శివలింగాన్ని దర్శించిన, స్పర్శించిన, అర్చించిన, అభిషేకించిన వారికి సప్తజన్మములొని పుణ్యఫలాన్ని, ఒక అశ్వమేద యాగం చేసిన ఫలాన్ని పొందుతారు. ఇది మన పురాణాలలో వ్రాయబడి ఉన్నదని అక్కడి భక్తుల విశ్వాసం.

భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు
ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసినట్లు… జాతరకు నర్సంపేట నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు ఆలయ నిర్వకులు చేశారన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని, పోలీస్ శాఖ వారు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆలయకమిటి నిర్వకులు శ్రీను తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments