Wednesday, February 11, 2026
spot_img
HomeSouth ZoneTelanganaప్రిన్సిపాల్‌ కొట్టడంతో విద్యార్థుల నిరసన: పాఠశాల వద్ద ఉద్రిక్తత

ప్రిన్సిపాల్‌ కొట్టడంతో విద్యార్థుల నిరసన: పాఠశాల వద్ద ఉద్రిక్తత

కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది విద్యార్థులను తరగతులకు ఆలస్యంగా వచ్చారని కారణంతో కొట్టారు. దీనికి నిరసనగా తోటి విద్యార్థులు 120 మంది కళాశాల నుండి బయటకు వచ్చి నిరసన తెలిపారు.  వారు కలెక్టరేట్కు వెళ్ళేందుకు ప్రయత్నించగా మడికొండ ఎస్ హెచ్ ఓ వారిని అడ్డుకున్నారు.  పోలీసులు విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, జోనల్ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం కళాశాల వద్ద శాంతియుత వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments