పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువుకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను విడుదల చేయడంతో చెరువు పూర్తిస్థాయిలో నిండింది. మంగళవారం జలాలకు పూజలు నిర్వహించి.
50 రాళ్ల మొరవ వద్ద నీటిని వదిలిపెట్టారు. మొరవ ప్రారంభం కావడంతో ప్రజలు ఆసక్తిగా తరలివచ్చి, కృష్ణమ్మ జలాలతో సెల్ఫీలు తీసుకుని సంబరాలు చేసుకున్నారు. చెరువు నీటితో నిండుగా ఉండటంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు# కొత్తూరు మురళి.




