శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) పరిధిలో చదివిన కడప, అన్నమయ్య జిల్లాల విద్యార్థులకు శుభవార్త. పాత నిబంధనల ప్రకారం డిగ్రీలో ఫెయిల్ అయిన వారికి చివరి అవకాశం కల్పిస్తూ, ఈ నెల 26వ తేదీ నుంచి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణ అధికారి రాజమాణిక్యం తెలిపారు.
విద్యార్థులు తమ ID ప్రూఫ్/ఆధార్ ఒరిజినల్ తో ఈ నెల 20వ తేదీ నుంచి SVUలో హాల్ టికెట్లు పొందవచ్చని సూచించారు. ఇది వారికి ఇదే చివరి అవకాశం అన్నారు.




