మంగళవారం మదనపల్లెలో జరిగిన ఘటనలో, నిమ్మనపల్లె మండలం ముస్టూరు గ్రామానికి చెందిన ప్రభాకర్ (40) అనే భవన కార్మికుడు కొత్తపల్లెలో నిర్మాణ పనులు చేస్తుండగా మిద్దెపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.
జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
