Home South Zone Andhra Pradesh Pawan Kalyan: అసెంబ్లీలో పవన్ కల్యాణ్ ఛాంబర్ కు వెళ్లి కలిసిన నారా లోకేశ్.

Pawan Kalyan: అసెంబ్లీలో పవన్ కల్యాణ్ ఛాంబర్ కు వెళ్లి కలిసిన నారా లోకేశ్.

0

ఈరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా
తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన పవన్, లోకేశ్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నారు. దీని తర్వాత ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.

మరోవైపు, అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛాంబర్ కు మంత్రి నారా లోకేశ్ వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై వీరు చర్చించారు.

NO COMMENTS

Exit mobile version