Home South Zone Andhra Pradesh వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ. |

వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ. |

0

మదనపల్లె మండలం, కోళ్ళబైలు పంచాయితీ, అమ్మచెరువుమిట్టలోని వెలుగు వృద్ధాశ్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో డాక్టర్ టీ నాగజ్యోతి ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ నాగజ్యోతి మాట్లాడుతూ ఆయుర్వేదం తల్లిపాలు వంటిదని, అందులో కల్మషం ఉండదని తెలిపారు. వృద్ధులకు సీజనల్ వ్యాధులకు అనుగుణంగా మందులు అందించారు.

వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, డాక్టర్ నాగజ్యోతికి కృతజ్ఞతలు తెలిపి, మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. అనంతరం డాక్టర్ నాగజ్యోతిని శాలువాతో సత్కరించి, మొమెంటో అందజేశారు.

NO COMMENTS

Exit mobile version