యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కల్పించేందుకు గురువారం సర్వోదయ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ మేరకు బుధవారం డీఈవోను వారు కలిశారు. గురువారం సాయంత్రం 3 గంటలకు మదనపల్లి పట్టణంలోని జ్ఞానోదయ స్కూల్లో తొలి కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు




