Thursday, February 12, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshయానాదుల గుర్తింపుపై కలెక్టర్ ఆదేశాలు |

యానాదుల గుర్తింపుపై కలెక్టర్ ఆదేశాలు |

చెరుకుపల్లి: జిల్లాలో ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఇంటి స్థలాలు లేని యానాది కుటుంబాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు.

గురువారం చెరుకు పల్లిమండలం ఆరుంబాకపంచాయతీ,కమినేనివారి పాలెం గిరిజన కాలని నందు రెడ్ క్రాస్ సంస్థ  ఆధ్వర్యంలో  నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజనులకు నిత్యావసర వస్తువులను కలెక్టర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ఎన్ని యానాది కుటుంబాలు ఉన్నాయని, అందులో ఎంత మందికి ఆధార్,రేషన్ కార్డులు,ఇంటి స్థలాలు ఉన్నాయా లేవాని పూర్తి సర్వే చేయాలని జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఆదేశించారు. మండలాల వారిగా యానాది కుటుంబాలు ఎంత మందికి ఆధార్ కార్డు లేదు,ఎంత మందికి రేషన్ కార్డు, ఎంత మందికి ఇంటి స్థలాలు ఉన్నాయా లేవని సర్వే చేయాలన్నారు.

ముఖ్యంగా ఆధార్ కార్డు ఉంటేనే రేషన్ కార్డు వస్తుందని తెలిపారు. ఎంత మందికి ఆధార్  లేదన్న జాబితా తయ్యారు చేసి ఆధార్ క్యాంపు లు పెట్టి ఆధార్ కార్డులు   తీయించుటకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారిణి ఆదేశించారు.

బాపట్ల జిల్లా లోని నిరుపేదలైన యానాది కుటుంబాలకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా  నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా  ఆరుంబాక పంచాయతీ,కమినేనివారి పాలెం గిరిజన కాలని నందు10 యానాది  కుటుంబాలకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా నిత్యవసర సరుకులు, దుస్తులు, ఒక బస్తా బియ్యం, కూరగాయలు, కిచెన్ కిట్లు, దుప్పట్లు, రగ్గులు, టార్పాలిన్ పట్టలను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ యన్.రామలక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి అబ్భులు,తహశీల్దార్ సిహెచ్ పద్మావతి, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు నారాయణ భట్టు,  పంచాయతీ సెక్రటరీ, వి ఆర్ ఓ , యానాది కుటుంబాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
(జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి, బాపట్ల వారిచే జారీచేయడమైనది.)

#Narendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments