Friday, February 13, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshరోగి సేవలపై నిర్లక్ష్యానికి కఠిన చర్యలు: డా. సిద్ధార్థ |

రోగి సేవలపై నిర్లక్ష్యానికి కఠిన చర్యలు: డా. సిద్ధార్థ |

బాపట్ల: పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వారిని ఆరోగ్యం వంతులుగా తీర్చిదిద్దుతున్నామని బాపట్ల ఏరియా వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ సిద్ధార్థ అన్నారు. గురువారం ఏరియా వైద్యశాలలో  సిబ్బంది పనితీరు, ఎక్సరే, స్కానింగ్, రక్త పరీక్షలు, మందులు పంపిణీ చేసే గది, ఎమర్జెన్సీ వార్డ్, సాధారణ వార్డులు క్షుణంగా పరిశీలించి వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి సిబ్బంది పనితీరు రోగులతో ప్రవర్తిస్తున్న విధివిధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం వైద్యశాలలో ఓపి శాతం పెరిగిందని చాలామంది ప్రజలు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులను సంప్రదించి వైద్యశాలలో అందించే నాణ్యమైన మందులను వాడుతూ రోగులు వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారన్నారు.

సమస్యలుంటే నేరుగా తనను సంప్రదించాలి  ఏరియా వైద్యశాలకు వచ్చే రోగులకు వైద్యశాలలో ఏమైనా సమస్యలు ఎదురైతే నేరుగా తనను కలిసి సమస్యను తెలపాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే సమస్యను పరిష్కరించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతామన్నారు. వైద్యశాలలో 21 మంది నిపుణులైన వైద్యులు ఉన్నారని ఒక్కొక్క ఆరోగ్య సమస్యకు ఆ వైద్యులు సమస్యను బట్టి రోగానికి వైద్యం అందించడంతో పాటు నాణ్యమైన మందులు ఇచ్చి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తమపై ఉందన్నారు. 21 డాక్టర్ల పర్యవేక్షణలో 89 మంది నర్సుల బాధ్యతతో కూడిన విధి నిర్వహణ చేస్తూ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.

రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవు
పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులు, ఓపి విధానంలో వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చూపించి వారికి సరైన సమాధానం చెప్పకుండా వ్యవహరిస్తే వారిపై విచారణ చేసి నిర్లక్ష్యం వహించినట్లు రుజువైతే వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రోగుల పట్ల సిబ్బంది ఓపికతో ఉంటూ సరైన సమాధానం చెప్పి ఆరోగ్యం వంతులుగా చేయాలని సూచనలు చేశారు. రోగులు కూడా విధి నిర్వహణలో ఉన్న వైద్యులను సిబ్బంది పట్ల అమర్యాదగా ప్రవర్తించకుండా దురుసుగా వ్యవహరించకుండా ఒత్తిడి లేని వైద్యాన్ని వైద్యుల నుండి పొందాలని రోగులకు సూచనలు చేశారు.

#Narendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments