Thursday, February 12, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshచందోలు పీహెచ్‌సీలో రోగులకు వైద్యం అందక ఇబ్బందులు |

చందోలు పీహెచ్‌సీలో రోగులకు వైద్యం అందక ఇబ్బందులు |

చందోలు:  చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారులు మాయాజాలం. చందోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు సమయపాలన ఎక్కడ….? చట్టం చూపుగా వచ్చి పోతారే కానీ సమయపాలన ఉండదు.
వైద్య అధికారులకు సూపర్వైజర్లు సిబ్బంది అడుగులకు మడుగులు. రోగులు వైద్య అధికారుల కోసం ఎదురుచూపులు రోగులకు అష్ట కష్టాలు. వైద్య అధికారులు సిబ్బంది తీరుపై మండిపడుతున్న చందోలు పరిసర గ్రామాల ప్రజలు రోగులు
అధికారుల సమయపాలన నిర్లక్ష్యానికి పాడాలి చమర గీతం.

బాపట్ల జిల్లా పిట్లవారిపాలెం మండలం చందోలు గ్రామంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో రోగులు పడరాని పాటలు పడుతూ అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు. పది గంటలు దాటినా పత్తాలేని సిబ్బంది డాక్టర్ల కోసం రోగులపడిగాపులు
గంటల పాటు తల్లిడిల్లిన బాధితులుఆస్పత్రిలో సిబ్బంది సమయపాలన పాటించకపోవటంతో రోగులు నానా అవస్తలు పడిన సంఘటన చందోలు పరిధిలోని  ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి. చందాలు  ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి  అనేక గ్రామాల నుంచి రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కాగ గురువారం గ్రామంలో  పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ మహిళా కూలీ చేతికి తీవ్ర గాయమైంది. దీంతో ఆమెను హుటాహుటిన  సిబ్బంది ఉదయం 8 గంటలకు స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అప్పటి నుంచి ఆమె వైద్యుల కోసం 10.30 వరకు వేచి చూసినా పత్తాలేదు.గతంలో గ్రామానికి చెందిన వెంకటేశం అనే వ్యక్తికి ఓ ప్రమాదంలో చేతికి గాయమైంది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చినా వైద్యులు అడ్రస్సే లేదువైద్యది అధికారుల సమయపాలన నిర్లక్ష్య తీరుపై బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు డిఎం హెచ్ ఓ  కఠిన చర్యలు తీసుకోవాలని పరిసర గ్రామాల ప్రజలు రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అటు అధికారులు ఇటు సిబ్బంది ప్రతిరోజూ ఇదే తంతు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందనంగా వైద్య అధికారుల తీరు ప్రజలకు శాపంగా మారింది.

#Narendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments