అన్నమయ్య జిల్లా సోమల మండలం దుర్గం కొండపై వెలసిన శ్రీ గార్గేయ మహాముని ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సుమారు 10 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేయడంతో ఎమ్మార్వో మధుసూదన్, ఎంపీడీవో ప్రసాద్ పర్యవేక్షణలో సౌకర్యాలు కల్పిస్తున్నారు.
అధికారుల సమన్వయంతో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సిద్ధమయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
# కొత్తూరు మురళి.




