మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సూరారం పోలీస్ స్టేషన్ లో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ను రంగురంగుల విద్యుద్వీకరణ వెలుగులతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా సూరారం ఎస్ హెచ్ ఓ (SHO) సుధీర్ కృష్ణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఉదయం పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం కమిషనరేట్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సామాజిక బాధ్యతగా మల్లారెడ్డి హాస్పిటల్ లో జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ సుదీర్ కృష్ణ మాట్లాడుతూ.. ప్రజల రక్షణే ద్యేయంగా పనిచేస్తున్న సైబరాబాద్ కమిషనరేట్ ప్రస్థానంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూరారం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
#sidhumaroju
