గురువారం పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, బూరగమంద సచివాలయంలో ఎమ్మార్వో ప్రమీల ఆధ్వర్యంలో పిఎం ఉజ్వల్ యోజన పథకం కింద పలువురు ఎస్టీలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, స్టవ్, రెగ్యులేటర్, పైప్ పంపిణీ చేశారు.
రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్లు లేనివారు ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలని ఏజెన్సీ నిర్వాహకులు వంశీ తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.




