శాసనమండలిలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
40% పాఠశాలలు 2 స్టార్ కంటే తక్కువ రేటింగ్‌లో ఉన్నాయని, వాటి అభివృద్ధికి ₹7,500 కోట్లు అవసరమని వెల్లడించారు.
ఇప్పటికే ₹500 కోట్ల బకాయిలు చెల్లించామని, తరగతికో ఉపాధ్యాయుడు విధానాన్ని 3% నుండి 33 శాతానికి పెంచామని తెలిపారు.
విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ (AI) టూల్స్ వాడుతున్నామని పేర్కొన్నారు.
