ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుండి ఈ కోర్సులో చేరాలంటే నీట్ యూజీ (NEET-UG) స్కోరు తప్పనిసరి చేస్తూ సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష అనంతరం, జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రవేశాల్లో పారదర్శకత కోసమే ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నర్సింగ్ విద్యార్థులు ఇకపై జాతీయ స్థాయి పోటీకి సిద్ధం కావాల్సి ఉంటుంది.










