పుంగనూరు పట్టణంలోని న్యాయవాదుల సంఘం కార్యాలయంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఓటింగ్ ప్రక్రియలో తలెత్తిన వివాదం కారణంగా న్యాయవాదుల మధ్య ఘర్షణ జరగడంతో పోలింగ్ కేంద్రం వద్ద రసాభాస నెలకొంది.
వెంటనే స్పందించిన పోలీసులు, సీనియర్ న్యాయవాదులు గొడవను సద్దుమణిగించారు. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
# కొత్తూరు మురళి.










