దుర్గమ్మ చెంత ఏపీ బడ్జెట్!
ఆంధ్రప్రదేశ్ 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులకు అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సుమారు ₹3.50 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్‌కు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను సభకు సమర్పించనున్నారు.










