వాహనాల కొనుగోలులో అక్రమ వసూళ్లకు చెక్: కలెక్టర్ సీరియస్!

0
0

అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని వాహన షోరూమ్‌లలో అక్రమ వసూళ్లను నిరోధించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.

షోరూమ్‌లలో ఇన్‌వాయిస్ ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని, అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

వాణిజ్య వాహనాల పన్ను ఎగవేతదారులపై నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండి, అధిక ధరలు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.