విశాఖ కలెక్టరేట్ వద్ద సీపీఐ గర్జన!

0
0

విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులను ప్రైవేట్ షాపులకు అమ్ముకుంటున్నారని, కనీస వసతులు కరువయ్యాయని నేతలు ఎం. పైడిరాజు, సత్యనారాయణ మండిపడ్డారు.

నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తూ రోగులను దోచుకుంటున్నాయని ఆరోపించారు. నాణ్యత లేని మందులతో పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.