Saturday, February 14, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshచెన్నపట్నం చెరువులో బోటింగ్? అధికారుల పరిశీలన!

చెన్నపట్నం చెరువులో బోటింగ్? అధికారుల పరిశీలన!

పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఇరికిపెంట పంచాయతీలోని చెన్నపట్నం చెరువును శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులు సందర్శించారు.

ఈ ఈ నాగార్జున రెడ్డి నేతృత్వంలోని బృందం చెరువు అభివృద్ధి పనులతో పాటు అక్కడ బోటింగ్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించింది. దీనిపై త్వరలోనే ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, చెరువు చైర్మన్ గల్లా బోస్ మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments