Home South Zone Andhra Pradesh మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు!

మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు!

0

ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందులో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ భేటీలో ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయి. లోకేష్ స్వయంగా అతిథులకు మంగళగిరి పట్టుచీరలను బహుకరించి, యువత భవిష్యత్ ప్రణాళికలపై ఆరా తీశారు.

ఈ కార్యక్రమం ఏపీ రాజకీయాల్లో కొత్త సంప్రదాయానికి నాంది పలికిందని కేశినేని కొనియాడారు.

NO COMMENTS

Exit mobile version