శ్రీశైలం భక్తులకు టీడీపీ నేత మన్నే రవీంద్ర ఆధ్వర్యంలో అన్నదానం |

0
0

ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం టీడీపీ నేత, మాజీ టెక్నాలజీ చైర్మన్ డాక్టర్ మన్నే రవీంద్ర వర్గం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వడ్లమూరి లింగన్న, షేక్ జిలాని, వెన్న వెంకట్ రెడ్డి వంటి ముఖ్య నేతలు పాల్గొని భక్తులకు సేవలు అందించారు.

కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.