రాష్ట్ర పునర్నిర్మాణం, సంక్షేమానికి ఊతమిచ్చేలా ఉన్న 2026-27 ఏపీ బడ్జెట్‌పై చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య హర్షం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమానికి రూ. 51,021 కోట్లు, ఆదరణ పథకానికి రూ. 1,000 కోట్లు కేటాయించడంపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బడ్జెట్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, ‘విజన్ 2047’ లక్ష్య సాధనకు దిక్సూచిలా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
#Narendra










