నేలకొండపల్లి హైవేపై కారు-బైక్ ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు

0
0

ఖమ్మం – కోదాడ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేలకొండపల్లి మండలం పైనంపల్లి మరియు శాంతినగర్ మధ్య గల పెట్రోల్ బంక్ సమీపంలో అతివేగంగా వచ్చిన ఒక కారు, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న భైరవనపల్లి గ్రామానికి చెందిన ఒక పురుషుడు, ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి, వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.