కోర్టుకు మాజీ మంత్రి జోగి రమేష్: మదనపల్లెలో ఘనస్వాగతం

0
0

అన్నమయ్య జిల్లా ములకలచెరువు అక్రమ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము సోమవారం తంబళ్లపల్లె కోర్టుకు హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో హార్సిలీహిల్స్‌కు వెళ్తున్న జోగి రమేష్‌కు మదనపల్లెలో వైఎస్సార్‌సీపీ నాయకుడు నిస్సార్ అహమ్మద్ మర్యాదపూర్వక స్వాగతం పలికారు.

రమేష్‌ను దుశ్శాలువతో సన్మానించిన నిస్సార్, స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మదనపల్లెలో పార్టీ బలోపేతానికి నిస్సార్ అహమ్మద్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా జోగి రమేష్ అభినందించారు.