నిమ్మనపల్లిలో శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలు

0
0

మదనపల్లె మండలం చల్లవారిపల్లిలో శ్రీ కృష్ణదేవరాయల జయంతిని జనసేన నాయకులు తోట కళ్యాణ్, అడపా సురేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రాయల పరిపాలనను స్మరిస్తూ యువతతో కలిసి కేక్ కట్ చేశారు. వేసవి నేపథ్యంలో గ్రామస్థులకు మజ్జిగ పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. రాయల స్ఫూర్తితో సామాజిక సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.