పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బోయకొండ సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్సై నాగేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు శనివారం మెరుపు దాడి చేశారు.
ఈ దాడిలో తొమ్మిది మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1,78,200 నగదు, 9 సెల్ ఫోన్లు మరియు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారు మదనపల్లెతో పాటు కర్ణాటకలోని బెంగళూరు, ముల్బాగల్ ప్రాంతాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.
# కొత్తూరు మురళి.










