పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని పలు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదివారం పర్యటించారు.
అధికారులతో కలిసి పరిస్థితులను సమీక్షించిన ఆయన, కోళ్ల ఉత్పత్తులను బాగా ఉడికించి తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అస్వస్థతకు గురైన వారి వివరాలను సేకరించాలని వైద్య సిబ్బందిని ఆదేశిస్తూ, వ్యాధి వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.










